అమెజాన్‌లో అమ్మకానికి ‘విషం’… ఎఫ్ఐఆర్ నమోదు

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇటీవల తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇటీవల అమెజాన్ వేదికగా గంజాయి అమ్మకాలు జోరుగా కొనసాగుతుండటంతో పలు విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అమెజాన్‌ను మరో వివాదం చుట్టుకుంది. దీంతో అమెజాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే… మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలుడు అమెజాన్ ద్వారా విషం (సల్ఫాస్ ట్యాబ్లెట్లు) కొనుగోలు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఈ విషయాన్ని హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా దృష్టికి తీసుకువెళ్లారు.

Read Also: వాయు కాలుష్యం ఎఫెక్ట్… వారి ఖాతాల్లో రూ.5వేలు జమ

ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో విషం అమ్మిన ఘటనను మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీంతో అమెజాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను హోంమంత్రి మిశ్రా ఆదేశించారు. అమెజాన్ నిర్వాహకుడిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. కాగా నవంబర్ 16న అమెజాన్ ద్వారా ఆన్‌లైన్‌లో గంజాయి విక్రయిస్తుండగా బింధ్ పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ గంజాయి ఏపీలోని విశాఖ నుంచి వచ్చిందని పోలీసుల విచారణలో వెల్లడైంది.

Related Articles

Latest Articles