మ‌ధ్య‌ప్ర‌దేశ్ మ‌రో రికార్ఢ్ః ఒక్క రోజులో 16 లక్షల మందికి వ్యాక్సినేషన్‌

దేశంలో వ్యాక్సినేష‌న్ ను వేగంగా అమ‌లు చేస్తున్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాలో 28,87,66,201 మందికి వ్యాక్సిన్ అందించారు.  జూన్ 21 వ తేదీ నుంచి దేశంలోని 18 ఏళ్లు నిండిన యువ‌త‌కు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామ‌ని కేంద్రం ప్ర‌క‌టించింది.  జ‌నాభా, వ్యాక్సిన్ వేస్టేజ్ ప్రాతిప‌థ‌క‌న రాష్ట్రాల‌కు వ్యాక్సిన్‌ను అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఇక ఇదిలా ఉంటే, జూన్ 21 వ తేదీన మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మెగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను నిర్వ‌హించింది.  ఇక్క‌రోజులో 16,73,858 మందికి వ్యాక్సిన్‌ను అందించింది.  

Read: “బాహుబలి” ఆఫర్ ను వదులుకున్న సామ్ ?

ఈ స్థాయిలో వ్యాక్సిన్‌ను అందించ‌డం ఇదే మోద‌టిసారి.  ఇందుకోసం మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని భోపాల్‌, ఇండోర్‌, జ‌బ‌ల్‌పూర్‌, సాగ‌ర్ డివిజ‌న్లుగా విభ‌జించి వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.  భోపాల్ డివిజ‌న్‌లో 3,75,962 మందికి, ఇండోర్ డివిజ‌న్‌లో 3,88,401 మందికి, జ‌బ‌ల్‌పూర్ డివిజ‌న్‌లో 2,07,160 మందికి, సాగ‌ర్ డివిజ‌న్‌లో 1,01,351 మందికి, ఉజ్జ‌యిని డివిజ‌న్‌లో 2,54,757 మందికి, రేవా డివిజ‌న్‌లో 152792 మందికి వ్యాక్సిన్ అందించారు.  ఇందుకోసం రాష్ట్రంలో మొత్తం 7000 వ్యాక్సినేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసింది శివ‌రాజ్‌ సింగ్ చౌహాన్‌ ప్ర‌భుత్వం.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-