షర్మిల పార్టీపై మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ నేత మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల పార్టీ నిన్నా..మొన్న పుట్టిందని… నడకలు కూడా ఆమెకు రాలేదని తెలిపారు. అప్పుడే పరుగులు పెడతా అంటే ప్రకృతికి విరుద్ధమని… పురుడు పోసుకున్నది మొన్ననేనని చురకలు అంటించారు. 9 నెలలు అయితే.. అడుగులు నేర్చుకోవచ్చన్నారు. ఆమె పై అంతకు మించి మాట్లాడేది ఏముండదని… కాంగ్రెస్ నాయకుడిగా వైఎస్‌ ని గౌరవిస్తామని తెలిపారు. తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి అంటే కొంత గౌరవం ఉండేదని…కానీ నిస్సిగ్గుగా మాట్లాడారని మండిపడ్డారు.

read also : హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పోటీపై షర్మిల క్లారిటీ

కెసిఆర్ కు నిరంజన్‌ రెడ్డి బానిస అని…హమాలీ పని చేసుకోండి అని అంటారా..? అని ఆయన పై ఫైర్‌ అయ్యారు. సీఎస్‌ సోమేష్ కుమార్‌ కాస్తా… కెసిఆర్ కుటుంబాన్ని అక్రమార్జన నుండి కాపాడే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా మారిపోయాడని ఆరోపించారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్ రామిరెడ్డి అవినీతి పై ఫిర్యాదు చేసామని… అవినీతి అధికారులపై కాంగ్రెస్ ఎంపీలంతా కలిసి డీపీఓ కి ఫిర్యాదు చేస్తామన్నారు. అవినీతి అధికారులపై హోం మంత్రి, ప్రధాని కి ఫిర్యాదు చేశామని…మోడీ, అమిత్ షా ల అపాయింట్‌ మెంట్ అడుగుతామన్నారు. భూముల అమ్మకం వెనక భూ కుంభకోణం ఉందని.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఫైర్‌ అయ్యారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-