30 యేళ్ళ క్రితం హీరోయిన్… ఇప్పుడు మాజీ సీఎం భార్య!

కాలం ఎంత వేగంగా సాగిపోతోందో తెలుసు కోవాలంటే… పాత సినిమాలు విడుదలైన రోజుల్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అప్పట్లో సూపర్ హిట్ అయిన సినిమాలన్నీ నిన్నోమొన్నో వచ్చినట్టే అనిపిస్తుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘రోజా’ సినిమా 1992 ఆగస్ట్ 15న విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ మ్యూజికల్ హిట్ మూవీలో అందమైన జంటగా నటించారు అరవింద్ స్వామి, మధుబాల. ఆ తర్వాత కాలచక్రం వడివడిగా సాగిపోయింది. తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించిన మధుబాల పెళ్ళి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాలలో నటించడం మొదలెట్టింది. అలానే అరవింద్ స్వామి సైతం ‘రోజా’ తర్వాత కొన్ని చిత్రాలలో కీలక పాత్రలు పోషించి, కొంతకాలం కనుమరుగైపోయి, మళ్ళీ ఇప్పుడు సినిమాల్లో బిజీ అయిపోయాడు.

Read Also: “యూటర్న్” బ్యూటీ హాట్ నెస్ తట్టుకోవడం కష్టమే…!

‘రోజా’ తర్వాత మణిరత్నం ‘ఇరువర్’లో ఎంజీఆర్ పాత్ర పోషించిన మోహన్ లాల్ సరసన మధుబాల ఓ పాటలో నర్తించింది. విశేషం ఏమంటే ఇప్పుడు ఇంతకాలానికి అదే ఎంజీఆర్ కు ఆమె భార్యగా నటించింది. ఇందులో మరో విశేషం కూడా ఉంది. దాదాపు 30 సంవత్సరాల క్రితం ‘రోజా’లో ఆమెకు జోడీగా నటించిన అరవింద్ స్వామి ఇప్పుడీ సినిమాలో ఎంజీఆర్ పాత్ర పోషించాడు. ఎ. ఎల్. విజయ్ దర్శకత్వం వహించిన ‘తలైవి’లో వీరిద్దరూ భార్యభర్తలైనా ఎంజీఆర్ అండ్ జానకీ రామచంద్రన్ గా నటించారు. జయలలిత బయోపిక్ గా తెరకెక్కిన ‘తలైవి’ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా లేటైంది. కంగనా రనౌత్ జయలలిత పాత్ర పోషించిన ‘తలైవి’ సినిమా విడుదల కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నానని మధుబాల చెబుతోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-