బిగ్ బాస్ హౌస్ లో అడల్ట్ సీన్స్.. వీడియోలు ఉన్నాయంటున్న హీరోయిన్

బిగ్ బాస్ తెలుగు సీజన్ రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఇక ఈ సీజన్ లో సిరి- షన్ను ల వ్యవహార శైలి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జెస్సి బయటికి వచ్చేశాక వీరిద్దరి మధ్య బంధం ఇంకా బలపడినట్లు కనిపిస్తోంది. ఎమోషనల్ గా ఎక్కువ ఫీల్ అవుటున్న సిరి ఓదార్పు కోసం షన్ను దగ్గరకు వెళ్లడం.. మధ్యలో హగ్గులు, కిస్సులు అంటూ వీరి వ్యవహారం చాలా తేడాగా ఉంటోంది.

ఇక ఈ షో గురించి నటి మాధవీలత షాకింగ్ కామెంట్స్ చేయడం ఇంకా సంచలనంగా మారింది. ఇటీవల హౌస్ లో రగులుతోంది మొగలిపొద సీన్స్ జరిగాయి.. ఆ ఫోటోలు, వీడియోలు నా దగ్గర ఉన్నాయి.. కానీ వాటిని పబ్లిష్ చేయడం పద్దతి కాదని పోస్ట్ చేయడం లేదంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మాధవి లత మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె అనడం కాదుకానీ ఆ షో లో కాస్తా అతి ఎక్కువగానే కనిపిస్తోంది.. ఫ్యామిలీలు చూసే షోలో ఈ శృంగారం ఏంటి అంటూ పలువురు మండిపడుతున్నారు.

Related Articles

Latest Articles