సమంత తల్లి కావాలనే ఆశలు చంపేశారు: మాధవిలత

నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుని రోజులు గడుస్తున్న వారి విడాకులపై కామెంట్స్ ఆగడం లేదు. ఫ్యాన్స్ నుంచి మొదలు సెలెబ్రెటీల దాకా ఎవరికి తోచిన కారణాలు వాళ్లు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా సమంత నాగచైతన్య విడాకుల విషయంలో నటి మాధవి లత సంచలన వ్యాఖ్యలు చేసింది.

‘చాలా మంది సమంత కారణంగా విడాకులు వచ్చాయని ఆమె తప్పుగా కామెంట్స్ చేస్తున్నారు. దయచేసి అలా చేయవద్దు. సమంత చాలా మంచి అమ్మాయి.. ముఖ్యంగా ఆమె వేసుకున్న బట్టల గురించి విడాకుల దాకా వెళ్ళింది అని కొందరు అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనె లాంటి స్టార్స్ చిన్న చిన్న బట్టలు వేస్తున్నారు.. అందుకని వాళ్ళ భర్తలు వాళ్ళను వదిలిపెట్టారా ? ‘అని మాధవిలత ధీటుగా సమాధానం ఇచ్చింది.

సమంత హిందూ దేవుళ్లను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడలేదు. ఆమె హిందూ దేవుళ్లను గౌరవిస్తుంది. ఆమె తిరుపతి మెట్లు ఎక్కి తన తాళిని కళ్ళకద్దుకుంది దీని ద్వారా చెప్పవొచ్చు ఆమె తన వివాహ జీవితానికి ఎంత విలువిస్తుందో..? అని మాధవిలత తెలిపింది.

ఇక సమంతను ఓ డబ్బులు తెచ్చే మెషిన్ లానే చూసారు తప్ప ఆమెను మనిషిలానే చూడలేదని మాధవిలత తెలిపింది. సామ్ కు పిల్లలు అంటే చాలా ఇష్టం, 30 ఏళ్ల లోపే పిల్లలని కనాలని ఉందని చాలా సందర్భాల్లో చెప్పింది. కానీ ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు పిల్లలు పుట్టకుండా ఆమెను సినిమాలకే వాడుకొని, ఆమె ఆశను చంపేశారని తెలిపింది. అదేవిధంగా కోట్లల్లో సంపాదిస్తే ఆమెకు కేవలం వేలల్లో పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళని ఆమె తన భాదను వ్యక్తం చేశారు. ఆమెను ఓ రోబో ల చూశారు. నాకు తెలిసినంత వరకు సమంత విడాకులు తీసుకొని విముక్తి పొందింది’ అంటూ మాధవిలత ఫేస్బుక్ లైవ్ లో స్పందించింది.

-Advertisement-సమంత తల్లి కావాలనే ఆశలు చంపేశారు: మాధవిలత

Related Articles

Latest Articles