షూటింగ్ స్పాట్ లో మాధవన్!

వర్సిటైల్ యాక్టర్ ఆర్. మాధవన్ నటించిన ‘నిశ్శబ్దం’, ‘మారా’ చిత్రాలు ఒకదాని వెనుక ఒకటి విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు నిజానికి థియేటర్లలో విడుదల కావాల్సినవి. కానీ కరోనా కారణంగా థియేటర్లు మూత పడటం, ఒకవేళ తెరిచినా పూర్తి స్థాయి ఆక్యుపెన్సీ లేకపోవడం వల్ల దర్శక నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేయడానికి మొగ్గు చూపారు. అలా ఓటీటీ లోనే ఈ రెండు మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఇదిలా ఉంటే…. మాధవన్ దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ : ది నంబీ ఎఫెక్ట్’ విడుదలకు సిద్ధంగా ఉంది. పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని బహు భాషలలో భారీ స్థాయిలో విడుదల చేయడానికి మాధవన్ సన్నాహాలు చేస్తున్నారు.

Read Also : ‘బజ్రంగీ భాయ్ జాన్ 2’… కేవీ విజయేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే…

కొవిడ్ 19 కారణంగా కొన్ని నెలలుగా ఇంటికే పరిమితమైన మాధవన్ ఇప్పుడు ఎట్టకేలకు తిరిగి సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలియచెప్పాడు. ‘ముంబై షూట్… మళ్లీ ఫోర్ల్స్ లోకి రావడం ఆనందంగా ఉంది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు మాధవన్. ఏ సినిమా షూటింగ్ లో తాను పాల్గొంటున్నాడో మాత్రం చెప్పలేదు. గడ్డంతో పాటు సాల్ట్ అండ్ పెప్పర్ హెయిల్ స్టైల్ తో మాధవన్ ఈ ఫోటోలో యమా స్టైల్ గా కనిపిస్తున్నాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-