‘ఆర్ఆర్ఆర్’ ని పొగిడిన కోలీవుడ్ స్టార్ హీరో

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఒమిక్రాన్ కనుక ప్రజలపై విరుచుకు పడకపోయి ఉంటె ఈపాటికి ఈ సినిమా హడావిడి మాములుగా ఉండేది కాదు. జనవరి 7 న సినిమా రిలీ అయ్యి రికార్డులు సృష్టించేది. కానీ, కరోనా దెబ్బతో ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఏం.. ఈ సినిమాకు సంబంధించిన ఏ వార్త అయినా నెట్టింట వైరల్ గా మారుతోంది. ఇక తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ సాంగ్ కి కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ కూడా ఫిదా అయిపోయాడు.

“నాటు నాటు సాంగ్ సాంగ్ ఇప్పుడే యూట్యూబ్ లో చూసాను.. చాలా అద్భుతంగా ఉంది.. రామ్ చరణ్ , తారక్ మధ్య స్నేహ బంధం నన్ను చాలా అసూయపడేలా చేస్తుంది. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. ఇక మ్యాడీ ట్వీట్ పై ఆర్ఆర్ఆర్ స్పందిస్తూ థాంక్స్ చెప్పారు.. ఇంక ఈ సినిమా రిలీజ్ చేసి భారతదేశంలో చలనచిత్ర కలెక్షన్లను తిరగరాయనున్నారు అని మాధవన్ అనగా.. థియేటర్ సమస్యలు ఉన్నాయని, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాం అంటూ ఆర్ఆర్ఆర్ మూవీ చేసిన వ్యాఖ్యల పట్ల మరోసారి మాధవన్ స్పందిస్తూ, మీరు కచ్చితంగా ఆ సమస్యలను అధిగమిస్తారు .. గ్రేట్ నెస్ కోసం ఆర్ ఆర్ ఆర్ మూవీ ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Related Articles

Latest Articles