రానా చేతుల మీదుగా “మాయోన్” టీజర్ రిలీజ్

సిబి సత్యరాజ్, తాన్యా రవిచంద్రన్, దాతో రాధా రవి కీలకపాత్రల్లో కిషోర్ ఎన్ రూపొందిస్తున్న చిత్రం “మాయోన్”. నిధి కోసం వెళ్ళే యువకుల టీంకు అడవిలో ఎదురయ్యే ప్రమాదాలు, ధైర్య సాహసాలతో కూడిన అడ్వెంచరస్ మూవీ ఇది. దేవాలయాల రహస్యం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మిస్టరీ థిల్లర్ షూటింగ్ పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఆసక్తికర చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను రానా దగ్గుబాటి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. “మాయోన్” టీజర్ ను విడుదల చేసిన రానా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ “మాయోన్” మూవీ విజయవంతం కావాలని కోరుకున్నారు. ఇక టీజర్ విషయానికొస్తే ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.

Read Also : పవన్ తో పూజాహెగ్డే… లీక్ చేసిన దర్శకుడు

మరోవైపు రానా దగ్గుబాటి ప్రస్తుతం “భీమ్లా నాయక్” సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన పవన్ కళ్యాణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ‘డేనియల్ శేఖర్’ పాత్రతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రానా ప్రధాన పాత్రలో నటించిన “విరాట పర్వం” కూడా విడుదలకు సిద్ధమవుతోంది.

-Advertisement-రానా చేతుల మీదుగా "మాయోన్" టీజర్ రిలీజ్

Related Articles

Latest Articles