శింబుకి మరో ఎదురు దెబ్బ… ‘మానాడు’ మార్నింగ్ షోలు రద్దు

కోలీవుడ్ హీరో శింబును దురదృష్టం వెంటాడుతూనే ఉంది. శింబు తాజా చిత్రం సైన్స్ ఫిక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ “మానాడు”. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో నటించిన “మానాడు” చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా, సురేష్ కామచ్చి నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో “ది లూప్” పేరుతో విడుదల చేస్తున్నారు. ఇక ఈరోజు చెన్నైలో ఉదయం 5 గంటలకు గ్రాండ్ గా విడుదల కావాల్సి ఉంది. అయితే ఆఖరి నిమిషంలో బెనిఫిట్ షోలన్నీ రద్దయ్యాయి. కేడిఎం సమస్యలే “మానాడు” ఎర్లీ మార్నింగ్ షోల రద్దుకు కారణం. ఈ ఆకస్మిక పరిణామంతో నిరుత్సాహానికి గురైన వేలాది మంది అభిమానులు ఉదయం 8 గంటలకు నెక్స్ట్ షో చూద్దామనే ఆలోచనతో తమ ఇళ్లకు తిరిగి రావాల్సి వచ్చింది.

Read Also : నిక్ బ్రదర్స్ పై ప్రియాంక చోప్రా దారుణమైన రోస్టింగ్… సమంత స్పందన

‘మానాడు’ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో శింబు కన్నీళ్లు పెట్టుకుని అందరినీ షాక్‌కు గురి చేశాడు. కొందరు వ్యక్తులు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని , వాటన్నింటినీ నేను చూసుకుంటాను. మీరు నన్ను జాగ్రత్తగా చూసుకోండి అంటూ శింబు తన అభిమానులను కోరాడు. గత దశాబ్ద కాలంగా శింబు తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించి అనేక వివాదాలను ఎదుర్కోవడం చూస్తూనే ఉన్నాము. శింబు సహకరించకపోవడంతో తమిళ నిర్మాతల మండలి ఆయనకు రెడ్ కార్డ్ కూడా జారీ చేసింది. ‘మానాడు’ నిర్మాత సురేష్ కామచ్చి ఈ ప్రాజెక్ట్ ప్రారంభం ఆలస్యం కావడానికి శింబు కారణమని ఆయనను ‘మానాడు’ నుండి తీసేశారు. దీంతో శింబు తన తండ్రి టి రాజేంధర్‌తో ‘మాఘ మానాడు’ అనే చిత్రాన్ని కూడా ప్రకటించాడు. కానీ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. తరువాత శింబు మళ్ళీ ‘మానాడు’ను పూర్తి చేయక తప్పలేదు. ఇన్ని అడ్డంకులను దాటుకుని ఈరోజు రిలీజ్ కు సిద్ధమైతే ఇక్కడ కూడా బెనిఫిట్ షోలన్నీ రద్దు కావడం గమనార్హం.

Related Articles

Latest Articles