“మా”లో విభేదాలు : బండ్ల గణేష్ అవుట్… ప్రకాష్ రాజ్ తో గొడవేంటి ?

“మా” ఎన్నికల వ్యవహారం గత కొన్ని రోజులుగా నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిన్న ప్రకాష్ రాజ్ “మా” ఎన్నికల్లో తన ప్యానెల్ కు సంబంధించిన లిస్ట్ ను విడుదల చేశారు. దాంట్లో అందరికీ షాకిస్తూ హేమ, జీవిత రాజశేఖర్ పేర్లు కూడా కన్పించాయి. గతంలో మహిళలకు అవకాశం అంటూ ఈ ఇద్దరూ “మా” అధ్యక్ష పదవికి పోటీదారులుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా వారిద్దరూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో కన్పించడం చర్చకు దారి తీసింది. దీని వెనుక మెగా హస్తం ఉందని గుసగుసలు విన్పించాయి. ప్రకాష్ రాజ్ ప్రెసిడెంట్ గా, వీళ్ళిద్దరూ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తారని అన్నారు. దీంతో ప్రకాష్ రాజ్ టీం సెట్ అనుకున్నారు అంతా. ఇందులో గమనించాల్సిన విషయం ఏమంటే మెగా అభిమాని, భక్తుడు, నిర్మాత బండ్ల గణేష్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్న ప్రకాష్ రాజ్ కే సపోర్ట్ చేశాడు. అనుకున్నట్టుగానే ఆయన ప్యానెల్ లో చేరాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో విబేధాలు నెలకొన్నాయని తెలుస్తోంది. అందులో నుంచి బయటకు వచ్చేసిన బండ్ల గణేష్ జనరల్ సెక్రెటరీ గా పోటీ చేస్తానని ప్రకటించడం ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.

Read Also : నీకు ప్రాబ్లెమ్ అయితే ఎల్లిపోతా మామ… “జాతిరత్నం”కు నాని పంచ్

“మా”లో జరుగుతున్న తాజా పరిణామాలు ఇలా ఉంటే.. ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. “మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు. నన్ను పోటీ చెయ్ అంటోంది. అందుకే ఈ పోటీ. అందరికీ అవకాశం ఇచ్చారు… ఒకే ఒక అవకాశం నాకివ్వండి. నేనేంటో చూపిస్తా…” అంటూ బండ్ల తనకు సపోర్ట్ చేయమని కోరారు. కాగా ప్రస్తుతం అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఏంటంటే మా ప్యానల్ నుంచి బండ్ల ఎందుకు బయటికొచ్చారు? ప్రకాశారాజ్ తో ఆయనకు గొడవేంటి? ఉన్నట్టుండి ఆయన పోటీ చేయాలనీ ఎందుకు అనుకుంటున్నారు? డ్రగ్స్ కేసుతో బండ్లకున్న లింకేంటి?… ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఎన్టీవీలో సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే బండ్ల గణేష్ ఇంటర్వ్యూను తప్పకుండా చూడాల్సిందే.

Related Articles

Latest Articles

-Advertisement-