జీవితా అంటే గౌరవం.. కానీ ఆమె వల్లే బయటకు వచ్చాను: బండ్ల

‘మా’ ఎన్నికల్లో ఈసారి ఎవరూ ఊహించని విధంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి వరకు ప్రకాష్ రాజ్ అయితేనే మంచి చేస్తాడని నమ్ముతున్నానంటూ చెప్పిన బండ్ల గణేష్.. అనూహ్యంగా ప్రకాష్ ప్యానల్‌లోకి వచ్చిన జీవితా రాజశేఖర్ ను వ్యతిరేకిస్తూ బండ్ల బయటకు వచ్చారు. మా ఎన్నికల్లో ఆమెకు పోటీగా జనరల్ సెక్రటరీగా పోటీ చేసి గెలుస్తానని సవాలు విసిరారు.

బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘జీవితా అంటే నాకు వ్యక్తిగతంగా కోపం ఏమిలేదు.. ఆమె అంటే చాలా గౌరవం.. కానీ, ఆమె వల్లే బయటకు రావాల్సివచ్చింది.. నేను దేవుళ్ళలా పూజించే వ్యక్తుల్ని జీవితా రాజశేఖర్ విమర్శించారు. అయినా జీవితా ఇన్నిరోజులు ‘మా’ పదవుల్లోనే వున్నారు. ఇప్పుడు వచ్చి ఆమె కొత్తగా చేసేది ఏంలేదు. ఆమెకు బదులు ఎవరైనా కొత్తవారు వచ్చివుంటే సంతోషించే వాణ్ణి.. పాతవారే కావాలనుకుంటే.. మళ్ళీ ప్రకాష్ రాజ్ లాంటి కొత్త ప్యానల్ ఎందుకు..?’ అంటూ బండ్ల గణేష్ సూటిగా ప్రశ్నించారు. మరి ఆ పూర్తి ఇంటర్వ్యూపై మీరు లుక్కేయండి.

Related Articles

Latest Articles

-Advertisement-