బిగ్ ట్విస్ట్: ‘మా’ ఎన్నికల నుంచి తప్పుకున్న సీవీఎల్

‘మా’ అధ్యక్ష పదవి పోటీ నుంచి సీవీఎల్ నరసింహారావు తప్పుకొని బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈమేరకు ‘మా’ అధ్యక్ష పదవికి వేసిన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. అయితే ఈ ఉదయమే మ్యానిఫెస్టో ప్రకటించిన సీవీఎల్.. అనుహ్యంగా పోటీ నుంచి తప్పుకోవడంతో మరోసారి మా ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. ఇక ప్రకాష్ రాజ్-మంచు విష్ణు మధ్య పోటీ నెలకోంది.

కాగా, ఇదివరకే జీవిత, హేమలు పోటీ నుంచి తప్పుకొని ప్రకాష్ రాజ్ ప్యానల్ లో చేరిన సంగతి తెలిసిందే.. ఇక నటుడు బండ్ల గణేష్ కూడా కొద్దిరోజుల అలక తరువాత ఆయన కూడా పోటీ నుంచి తప్పుకొని రీసెంట్ గా ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలిపాడు. అయితే తాజాగా సీవీఎల్ తన నామినేషన్ ను ఉపసంహరించుకోవడంతో.. ఆయన కూడా ఎవరికైనా మద్దతు తెలియజేస్తాడా..? లేదంటే సైలెంట్ గానే ఉండిపోతారా..! అనే దానిపైనా ఆయన తాజాగా స్పందించారు.

సీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. ‘నేను మా ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవికి పోటీ లో నామినేషన్ వేశాను. ఇప్పుడు నామినేషన్ నీ ఉపసంహరించుకున్నాను. అన్ని వివరాలు రెండు రోజుల్లో మీడియా వారికి చెపుతాను. ఉదయం కూడా నా మ్యానిఫెస్టోను ప్రకటించాను. నేను నామినేషన్ ఉపసంహరించడానికి కారణం వుంది. అధ్యక్ష పదవి కంటే నాకు మా సభ్యుల సంక్షేమం ముఖ్యం.. ఇప్పుడు పోటీలో వున్న రెండు ప్యానెల్స్ లో ఎవ్వరికీ నేను మద్దతు ఇవ్వటం లేదని’ సీవీఎల్ స్పష్టం చేశారు.

-Advertisement-బిగ్ ట్విస్ట్: ‘మా’ ఎన్నికల నుంచి తప్పుకున్న సీవీఎల్

Related Articles

Latest Articles