అడవిలోకి తీసుకెళ్లి అరాచకం చేశాడే..

కరీనగర్ లో దారుణం చోటుచేసుకొంది. వారం రోజుల క్రితం మిస్ అయిన యువతి అడవిలో శవంగా తేలింది. ప్రేమించిన ప్రియుడే ఆమెకు యముడిగా మారాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన ఒక యువతి , అదే గ్రామానికి చెందిన అఖిల్ అనే యువకుడు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే వారం రోజుల క్రితం ప్రియుడితో బయటికి వెళ్లిన యువతి ఇంటికి తిరిగి రాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులకు యువతి అడవిలో శవంగా కనిపించింది. దీంతో విచారణ చేపట్టగా అఖిల్ ప్రేమ విషయం పోలీసులకు తెలిసింది.

శనివారం అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు తమదైన రీతిలో విచారించగా.. యువతిని హత్య చేసింది తానేనని ఒప్పుకున్నాడు. అడవిలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యచారం చేసి, అనంతరం చంపేసినట్లు నిందితుడు పేర్కొన్నాడు. ప్రేమ పేరుతో నమ్మించి, ఆమెకు మాయమాటలు చెప్పి హత్య చేసినందుకు అతడిని అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని యువతీ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Related Articles

Latest Articles