సెప్టెంబర్ విజేత ‘లవ్ స్టోరీ’

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆగస్ట్ లో సినిమాలు థియేటర్లలో విడుదల కావడం మొదలైంది. ఆ నెలలో ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’, ‘రాజ రాజ చోర’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రాలను ప్రేక్షకులు కాస్తంత ఆదరించారు. అయితే…. అసలైన ఊపు సెప్టెంబర్ మాసంలో వచ్చిందని చెప్పాలి. ఈ నెలలో అనువాద చిత్రాలతో కలిసి ఏకంగా 31 సినిమాలు జనం ముందుకు వచ్చాయి. ఇందులో స్ట్రయిట్ తెలుగు సినిమాలు 20 కాగా, వివిధ భాషల నుండి అనువాదమైన సినిమాలు 11. సెప్టెంబర్ ఫస్ట్ వీకెండ్ లో మొత్తం ఏడు సినిమాలు విడుదల కాగా… అందులో కాస్తంత చెప్పుకోదగ్గది అవసరాల శ్రీనివాస్ నటించిన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ మాత్రమే. అనువాద చిత్రాలలో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ -9, షేంగ్ ఛీ’ విడుదలైనా… కమర్షియల్ గా ఈ వారం ఆహా అనిపించిన సినిమా ఒక్కటీ లేదు. ఇక సెకండ్ వీకెండ్ లో మొత్తం ఏడు సినిమాలు విడుదలయ్యాయి. నాని నటించిన ‘టక్ జగదీశ్’ ఓటీటీ ద్వారా జనం ముందుకు వచ్చింది. కానీ ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ టార్గెట్ ఆడియెన్స్ ను మెప్పించలేకపోయింది. ఇదే వారం వచ్చిన గోపీచంద్ ‘సీటీమార్’ మూవీ కమర్షియల్ హంగులతో ఫర్వాలేదనిపించింది. అనువాద చిత్రం ‘తలైవి’ ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ పరంగా మెప్పించినా, బాక్సాఫీస్ దగ్గర మాత్రం మ్యాజిక్ చేయలేకపోయింది.

మూడో వారాంతంలో బాక్సాఫీస్ బరిలో ఏకంగా 9 సినిమాలు సందడి చేశాయి. అందులో ఆరు స్ట్రయిట్ తెలుగు సినిమాలు కాగా మిగిలినవి అనువాద చిత్రాలు. సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’ ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇక నితిన్ ‘మాస్ట్రో’ ఓటీటీలో విడుదలైంది కాబట్టి దాని కలెక్షన్లను చెప్పలేని పరిస్థితి. ఈ వారం వచ్చిన విజయ్ సేతుపతి, విజయ్ ఆంటోనీ అనువాద చిత్రాలు సైతం ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇక ఫోర్త్ వీకెండ్ లో రెండు అనువాద చిత్రాలతో కలిపి మొత్తం ఐదు సినిమాలు విడుదల అయ్యియి. దానిలోని ‘లవ్ స్టోరీ’ విడుదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు కళకళలాడాయి. విశేషం ఏమంటే… ఓవర్సీస్ లోనూ ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ తొలి వారాంతానికి వరల్డ్ వైడ్ 40 కోట్లకు పైగా నెట్ వసూళ్ళు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనితో పాటే వచ్చిన సినిమాలేవీ తమదైన ముద్రను వేయలేకపోయాయి. ఇక సెప్టెంబర్ నెలాఖరులో వచ్చిన మచ్ అవైటెడ్ జేమ్స్ బాండ్ మూవీ ‘నో టైమ్ టు డై’ సైతం బాండ్ అభిమానులను నిరాశకు గురిచేసింది. మొత్తం మీద సెప్టెంబర్ మాసంలో 31 చిత్రాలు విడుదల కాగా… కలెక్షన్ల పరంగా ‘లవ్ స్టోరీ’ మూవీ అగ్రస్థానంలో నిలిచింది.

-Advertisement-సెప్టెంబర్ విజేత 'లవ్ స్టోరీ'

Related Articles

Latest Articles