అక్కడ రెండేళ్ల తరువాత… రిలీజ్ కు ముందే “లవ్ స్టోరీ” రికార్డులు

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “లవ్ స్టోరీ”. ఈ సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డు సృష్టించింది.

యూకేలో రెండేళ్ల తరువాత…!
టాలీవుడ్ కు మంచి వసూళ్లు సాధించి పెట్టే ప్రాంతాల్లో ఓవర్సీస్ కూడా ఒకటి. అందులో ముఖ్యంగా యుఎస్ఎ బాక్సాఫీస్ తెలుగు సినిమాకి ప్రధాన ఆదాయాన్ని అందించే మార్కెట్లలో ఉంటుంది. యూఎస్ తో పాటు యూకేలో కూడా ‘లవ్ స్టోరీ’ భారీ సంఖ్యలో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 900+ థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో యూకేలో దాదాపు రెండేళ్ల తరువాత విడుదలవుతున్న మొదటి చిత్రం ‘లవ్ స్టోరీ’ కావడం విశేషం. ఈ మేరకు మేకర్స్ థియేటర్స్ లిస్ట్ ను విడుదల చేశారు.

Image

Read Also : నెవర్ బిఫోర్ రికార్డులు సెట్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్

నిర్మాతల కొత్త ఆశలు
కరోనా మహమ్మారికి ముందు తెలుగు సినిమాలు విదేశీ మార్కెట్‌లో మిలియన్ డాలర్లు వసూలు చేసేవి. కానీ మహమ్మారి ఎఫెక్ట్ యుఎస్‌ఎలో టాలీవుడ్ సినిమాల వసూళ్లపై గట్టిగానే పడింది. కరోనా వచ్చాక యుఎస్‌ఎలోని థియేటర్లు పరిమిత సామర్థ్యాలతో నడుస్తున్నాయి. అందువల్ల అక్కడ విడుదలైన సినిమాలు ఇంతకుముందులా కలెక్షన్స్ వసూలు చేయలేకపోతున్నాయి. ఈ కరోనా కాలంలో “జాతి రత్నాలు” మాత్రమే యుఎస్ బాక్సాఫీస్ వద్ద బాగా రాణించగలిగింది. ఇప్పుడు శేఖర్ కమ్ముల “లవ్ స్టోరీ” అక్కడ విడుదలకు ముందే అద్భుతమైన ప్రీ-సేల్స్ పొందడం నిర్మాతలకు సరికొత్త ఆశను చిగురించేలా చేస్తోంది.

అదిరిపోయిన ప్రీ సేల్స్
సమాచారం ప్రకారం “లవ్ స్టోరీ” ప్రీ-సేల్స్ ఇప్పటి వరకు $150k వసూలు చేసింది. టెక్సాస్ ($ 27,475), కాలిఫోర్నియా ($ 16,447), న్యూజెర్సీ ($ 10,161), వర్జీనియా ($ 9,572) వంటి అనేక ప్రాంతాలలో సినిమా అమ్మకాలు చాలా బాగున్నాయి. డైరెక్టర్ శేఖర్‌ కమ్ములకు ఓవర్సీస్ మార్కెట్‌లో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అంతేకాకుండా సినిమా పాటలు, ట్రైలర్‌కు వీక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. పైగా సినిమాపై అంచనాలు పెరిగాయి. “లవ్ స్టోరీ” రేపు గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ రాత్రి ‘లవ్ స్టోరీ’ ప్రీమియర్ షోలు వేయనున్నారు.

“వకీల్ సాబ్” రికార్డు బ్రేక్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” రికార్డును సైతం బ్రేక్ చేసింది “లవ్ స్టోరీ”. కరోనా మహమ్మారి సమయంలో యూఎస్ఏ ప్రీ సేల్స్ ‘వకీల్ సాబ్’ $120K+. ఇక ఇప్పుడు యూఎస్ఏ ప్రీ సేల్స్ $150K+ సాధించి “లవ్ స్టోరీ” ఆ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. మరోవైపు ఈ సినిమా టికెట్లు సైతం హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నట్లు సమాచారం. మరి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాల్సిందే !

-Advertisement-అక్కడ రెండేళ్ల తరువాత... రిలీజ్ కు ముందే "లవ్ స్టోరీ" రికార్డులు

Related Articles

Latest Articles