“లవ్ స్టోరీ” ప్రీమియర్ కు షాకింగ్ కలెక్షన్లు

తెలుగు రొమాంటిక్ డ్రామా “లవ్ స్టోరీ” నిన్న థియేటర్లలోకి వచ్చింది. దీనికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా… అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. నాగచైతన్య, సాయి పల్లవి మొదటిసారి స్క్రీన్ స్పేస్ పంచుకున్నారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సమాచారం ప్రకారం “లవ్ స్టోరీ” యూఎస్ ప్రీమియర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. “లవ్ స్టోరీ” యూఎస్ లో 226 ప్రదేశాలలో ప్రీమియర్ కాగా… $306,795 (రూ.2.26 కోట్లు) వసూలు చేసింది. 2021లో అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి భారతీయ సినిమా ప్రీమియర్‌గా “లవ్ స్టోరీ” నిలిచింది.

Read Also : హాలీవుడ్ పై కన్నేసిన సితార

“లవ్ స్టోరీ” చిత్రం ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లలోకి రావాల్సి ఉన్నప్పటికీ కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా విడుదల వాయిదా పడింది. పలు వాయిదాల అనంతరం “లవ్ స్టోరీ” నిన్న దేశవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. భారతదేశంతో పాటు, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని కొన్ని ప్రదేశాలలో కూడా విడుదల చేశారు.

లీడ్ పెయిర్‌తో పాటు, లవ్ స్టోరీలో పోసాని కృష్ణ మురళి, రాజీవ్ కనకాల, దేవయాని, రావు రమేష్ , ఈశ్వరి రావు, తాగుబోతు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఈ చిత్రానికి ఎడిటర్, విజయ్ సి కుమార్ సినిమాటోగ్రాఫర్, పవన్ సి సంగీత దర్శకుడు.

-Advertisement-"లవ్ స్టోరీ" ప్రీమియర్ కు షాకింగ్ కలెక్షన్లు

Related Articles

Latest Articles