‘బొమ్మ బ్లాక్ బస్టర్’ నుండి పూరీ ఆంథమ్!

విభిన్న‌మైన చిత్రాలు చేస్తూ న‌టుడిగా తెలుగు ప్రేక్ష‌కుల్లో మంచి పేరుని సంపాదించిన నందు విజ‌య్‌కృష్ణ హీరోగా యాంక‌ర్ గా, హీరోయిన్ గా తెలుగు రాష్ట్రాల్లో స్పెష‌ల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ర‌ష్మి హీరోయిన్ గా చేస్తున్న చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్‌’. ఈ చిత్రాన్ని ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా రాజ్ విరాట్ దర్శకుడిగా ప‌రిచ‌యమ‌వుతున్నాడు.

తాజాగా పూరి జగన్నాథ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ చిత్ర బృందం ‘లవ్ ఆల్ ది హేటర్స్’ అనే పూరీ ఆంథమ్ ను విడుదల చేసింది. దీనిని పూరి తనయుడు ఆకాశ్ పురి విడుదల చేసి, యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపాడు. పూరీ జగన్నాథ్ మాటలతో ఈ పాట మొదలైంది. ‘పుట్టుకతోనే నువ్వు గెలిచి వచ్చావ్.. ఇంకా నీకు ఓటమి ఏంటన్నా’ అంటూ అద్భుతమైన లిరిక్స్‌తో ఈ పాట సాగుతుంది. ‘ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా పాటలకు, టీజర్ కు అటు ఆడియెన్స్ లో.. ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో అనూహ్య స్పంద‌న వచ్చిందని, ట్రేడ్‌ లో కూడా బిజినెస్ క్రేజ్ ని సొంతం చేసుకుందని, ఈ పూరి ఆంథమ్ సైతం శ్రోతల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

-Advertisement-'బొమ్మ బ్లాక్ బస్టర్' నుండి పూరీ ఆంథమ్!

Related Articles

Latest Articles