ఎల్బీనగర్ లోటస్ ఆస్పత్రిలో దారుణం

హైదరాబాద్ ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్‌కి ఎదురుగా ఉన్న లోటస్‌ఆస్పత్రిలో అక్రమ బిల్లులుకు తెర తీశారు ఆస్పత్రి సిబ్బంది. కంప్యూటరైజ్డ్ బిల్లు అంటూ అక్రమంగా బిల్లులు వసూలుకు సిద్ధమైన లోటస్‌ ఆస్పత్రి యాజమాన్యం. ఉదయం 11 గంటల నుంచి డెలివరీ అయిన పేషెంట్‌తో సహ చిన్న బేబీని ఆస్పత్రిలోనే ఉంచి ఇబ్బందిపెడుతున్న ఎల్బీనగర్‌ లోటస్‌ యాజమాన్యం. ఇప్పటికే పేషంట్‌ నుంచి ఒక ఒక లక్షా 31వేల బిల్లు వసూలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.

Read Also:అధికార అహంకారంతో కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కాయి: బండి సంజయ్

ఇంకా కట్టాలంటూ పేషెంట్‌ని వేధిస్తున్న లోటస్‌ ఆస్పత్రి యాజమాన్యం. ఏం చేయాలో పాలు పోక మీడియా ప్రతినిధులను ఆశ్రయించిన బాధితుడు. ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా పచ్చి బాలింతను,చిన్న బేబీని ఇబ్బంది పెడుతున్నారంటూ బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలింతకు ఆహారమైనా అందించాలని ఆవేదన చెందుతున్న కుటుంబం. న్యాయం చేయాలంటూ ఎల్బీనగర్‌ లోటస్‌ ఆస్పత్రి ముందు బాధితుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Latest Articles