విచిత్ర పెళ్లి.. లాటరీ తీసి వధువు ఎంపిక..

ఓ విచిత్రమైన పెళ్లి జరిగింది.. ఎక్కడైనా పెళ్లి చూపుల ద్వారా వధువు, వరులను ఎంచుకుంటారు.. ఇంకా కొందరైతే లవ్‌ మ్యారేజ్‌ చేసుకుంటారు.. కానీ, కర్ణాటకలో లాటరీ వేసి లగ్నం చేసుకుంది ఓ జంట… దానికి కారణం.. ఇద్దరు యువతులు.. ఇకే అబ్బాయిని లవ్‌ చేయడం.. ఒకే యువకుడి కోసం ఇద్దరు యువతులు పోటీ పడడంతో లాటరీ వేసి.. ఎవరు అతడికి భార్య కావాలో నిర్ణయించుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని హసన్‌ జిల్లా సకలేశపుర ప్రాంతానికి చెందిన ఓ యువకుడు.. ఇద్దరు యువతులతో ప్రేమాయణం సాగించాడు.. అయితే, ఆ ఇద్దరు యువతులు అతడినే పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. వీరిలో ఓ యువతి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.. స్థానికులు సకాలంలో స్పందించి ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ పంచాయతీ కాస్త గ్రామ పెద్దల వరకు వెళ్లింది.. దీంతో.. లాటరీ ద్వారా ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేస్తామని యువతులకు చెప్పారు. ఇక, ఇద్దరు యువతులు ఓకే చెప్పడంతో లాటరీ తీశారు.. అందులో విషం తాగిన అమ్మాయి పేరే వచ్చింది. ఆ తర్వాత ఆ ఇద్దిరికీ పెళ్లి చేశారు.. మొత్తంగా లాటరీతో ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ సుఖాంతం అయ్యింది.

Related Articles

Latest Articles

-Advertisement-