గురుకుల విద్యార్థులను తీసుకెళ్లిన తల్లిదండ్రులు.. ఏం జరిగిందంటే..?


ప్రభుత్వం ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కళాశాలలో మెరుగైన విద్యను అందిస్తున్నట్టు చెబుతోంది. కానీ ఆచరణలో మాత్రం చాలా అధ్వానంగా ఈ సంస్థలు ఉన్నాయని అర్థమవుతోంది. జగిత్యాల జిల్లా బీసీ గురుకులంను చూస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుంది. జిల్లాలోని కోరుట్ల గురుకులం నుంచి కూడా 380 విద్యార్థులను వారి తల్లిదండ్రలు తీసుకెళ్లారు.

ఏం జరిగిందంటే..?
ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యోతిరావుపూలే రెసిడెన్షియల్‌ గురుకుల పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రలు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన బీసీ గురుకులంలో 7, 8, 9 తరగతులు జరుగుతున్నాయి. ఇందులో సుమారు 380 మంది విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలో మౌలిక వసతులులేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నిత్యం అవస్థలు పడుతున్న విషయాలను పిల్లలు వారి తల్లిదండ్రులకు చెప్పారు.

దీంతో తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాఠశాలకు వచ్చి ధర్నా చేశారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని ధర్నా నిర్వహించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. తల్లిదం డ్రులు తమ పిల్లలను పాఠశాల నుంచి తీసుకువెళ్లారు. జిల్లా కలెక్టర్‌ కు పరిస్థితిని వివరిస్తామని తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వా న్ని నమ్మి గురుకుల పాఠశాలలకు పంపిస్తే సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అస లే కరోనా సమయం కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం భయంగా ఉందని తల్లి దండ్రులు భయపడుతున్నారు. ప్రభు త్వం ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.

Related Articles

Latest Articles