తనికెళ్ళ భరణికి లోక్ నాయక్ పురస్కారం

ప్రముఖ నటుడు, రచయిత, సాహితీ వేత్త తనికెళ్ళ భరణికి లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం ప్రకటించింది. జనవరి 18న ఎన్టీఆర్, హరివంశరాయ్ బచ్చన్ వర్థంతి సందర్భంగా ఈ పురస్కారాన్ని అయనకు అందచేయనున్నారు. ఈ మేరకు లోక్ నాయక్ ఫౌండేషన్ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రకటించారు. సోమవారం ఆంధ్రాయూనివర్శిటీలో మీడియాకు తెలియచేశారాయన. ఇప్పటి వరకూ ఈ పురస్కారం కింద లక్షరూపాయల నగదుని బహుమతిగా అందచేసి సత్కరిస్తూ వచ్చారు. అయితే ఈ ఏడాది రెండు లక్షల నగదును బహుమతిగా అందచేసి సత్కరించనున్నట్లు తెలిపారు లక్ష్మీప్రసాద్. గతంలో భరణికి పలు సాంస్కృతిక అవార్డులతో పాటు ప్రభుత్వ నంది అవార్దులు కూడా లభించాయి. ఇప్పడు ఈ లోక్ నాయక్ పురస్కారం ఆయన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా భావించవచ్చు.

Related Articles

Latest Articles