ముంబైలో లాక్‌డౌన్‌… ఎప్పుడంటే…!!

మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.  కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే నైట్ క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు.  ఆంక్ష‌ల‌ను క‌ఠినంగా అమ‌లుచేస్తున్నారు.  రోజువారీ కేసులు మ‌హారాష్ట్ర‌లో 11 వేలు దాటిపోయాయి.  ముంబై న‌గ‌రంలో 8 వేల‌కు పైగా రోజువారీ కేసులు న‌మోద‌వుతున్నాయి.  పాజిటివిటీ శాతం క్ర‌మంగా పెరుగుతున్న‌ది.  దీంతో ముంబై నగ‌రంలో లాక్ డౌన్ విధిస్తార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.  దీనిపై ముంబై న‌గ‌ర మేయ‌ర్ కిషోరీ ప‌డ్నేక‌ర్ స్పందించారు.  ముంబైలో లాక్‌డౌన్ విధించే అవ‌కాశం లేద‌ని, ముంబైలో రోజుకు 20 వేలు కేసులు న‌మోదైన‌పుడు లాక్‌డౌన్ విధించేందు మాత్ర‌మే అవ‌కాశం ఉంటుందని అన్నారు.  ఒమిక్రాన్ తీవ్ర‌త కార‌ణంగా క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.  రోజువారీ కేసులు 20 నుంచి 30 శాతం మేర పెరుగుతున్నాయి.  ఇది ఇలానే కంటిన్యూ అయితే, మ‌రో వారంరోజుల్లోనే ముంబైలో 20 వేల కేసులు న‌మోదు కావొచ్చు.  ఇక గృహ‌స‌ముదాయాల్లో, గేట్‌వే క‌మ్యూనిటీల్లో ఫ్లాట్‌ల‌లో నివశించేవారిలో 20 శాతం మందికి కోవిడ్ సోకితే కోవిడ్ ప్రోటోకాల్ ప్ర‌కారం 10 రోజుల‌పాటు సీజ్ చేస్తామ‌ని అన్నారు.  
  

Read: ఫ్రాన్స్‌లో మ‌రో కొత్త వేరియంట్‌: ఒమిక్రాన్‌ను మించేలా…!!

Related Articles

Latest Articles