లాక్ డౌన్: పెరిగిన గృహహింస ఫిర్యాదులు

కరోనా మహమ్మారి మహిళలకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. లాక్‌డౌన్‌‌తో ఇంటికే పరిమితం కావడంతో వేధింపులకు గురవుతున్నారు. రోజులో ఏదోవొక సందర్భంలో భర్తల చేతిలో భౌతిక దాడులకు గురవుతున్నారు. తెలంగాణలో రెండున్నరేళ్లలో పెరిగిన గృహ హింస ఫిర్యాదులే దీనికి నిదర్శనం. మహిళా సహాయ కేంద్రం ఏర్పాటు చేసిన రెండేన్నరేళ్లలో వచ్చిన ఫిర్యాదులు కన్నా కరోనా కాలంలోనే ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. రోజుకు సగటున సుమారు 28 చొప్పున ఏడాది కాలంలో 10,338 కేసులు నమోదయ్యాయి. అలాగే లైంగిక వేధింపులు, దాడుల కేసులూ ఎక్కువయ్యాయి. రెండున్నరేళ్లలో 380 కేసులు వస్తే గతేడాది ఏడాది ఏప్రిల్‌ నుంచి మార్చి వరకు 975 కేసులు నమోదయ్యాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-