తెలంగాణలో రేపటి నుంచి లాక్‌డౌన్

తెలంగాణలో కరోనా కేసులు విలయం కొనసాగుతున్న నేపథ్యంలో కెసిఆర్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ విధిస్తున్నట్లు కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ ఉండనుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు లాక్ డౌన్ నిర్ణయం తీసుకోగా.. మారికాసేపట్లో లాక్ డౌన్ మార్గదర్శకాలపై పూర్తి క్లారిటీ రానుంది. ఇక టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని కెబినెట్ నిర్ణయించింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-