లాక్‌డౌన్ మ‌ళ్లీ పొడిగింపు.. మ‌రికొన్ని మిన‌హాయింపులు

ఇంకా అనుకున్న స్థాయిలో క‌రోనా కేసులు అదుపులోకి రాక‌పోవ‌డంతో త‌మిళ‌నాడులో మ‌ళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగించింది ప్ర‌భుత్వం.. ఇప్ప‌టి వ‌ర‌కు లాక్‌డౌన్ ఆంక్ష‌లు ఈ నెల 7వ తేదీ వ‌ర‌కు అమ‌ల్లో ఉండ‌గా.. జూన్ 14 ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న‌ట్టు సీఎం ఎంకే స్టాలిన్ ప్ర‌కించారు.. అయితే, పాజిటివ్ కేసుల ఆధారంగా.. ప్రాంతాల వారీగా సడలింపులు ఇచ్చింది స‌ర్కార్.. కోవిడ్‌ కేసులు తగ్గిన చెన్నై, ఉత్తర మరియు దక్షిణ తమిళనాడు జిల్లాలకు ఎక్కువ స‌డ‌లింపులు ఇస్తున్నారు.. పశ్చిమ మరియు డెల్టా ప్రాంతంలో 11 జిల్లాల్లో కేసులు ఎక్కువ‌గా వెలుగు చూస్తున్నాయి.. ఆ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను క‌ఠినంగా అమ‌లుచేస్తారు.. ఇక‌, షాపింగ్ కాంప్లెక్స్, మాల్స్, పర్యాటక ప్రదేశాలు, సినిమా థియేట‌ర్లు, సెలూన్లు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా మూసివేయబడతాయి.

కోయంబత్తూర్, ది నీలగిరి, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, కరూర్, నమక్కల్, తంజావూర్, తిరువారూర్, నాగపట్నం మరియు మాయిలాదుత్తురైలకే స‌డ‌లింపులు ప‌రిమితం అవుతాయ‌ని త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు సీఎం స్టాలిన్.. తమిళనాడు అంతటా.. నిత్యావ‌వ‌స‌రాల‌కు అవ‌స‌ర‌మైన షాపులు, చేపలు మరియు మాంసం స్టాల్స్ ఉదయం 6 నుండి సాయంత్రం 5 గంటల మధ్య అనుమతించబడతాయి. కూరగాయలు, పండ్లు, పువ్వులు అమ్మే షాపుల‌ను ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వ‌ర‌కు తెరిచే ఉంటాయి.. చేపల మార్కెట్లలో మరియు కబేళాలలో హోల్‌సేల్ వ్యాపారం మాత్రమే అనుమతించబడుతుంది. భౌతిక దూరం ఉండేలా జిల్లా యంత్రాంగం ఒకటి కంటే ఎక్కువ చోట్ల బహిరంగ హోల్‌సేల్ మార్కెట్లకు ఏర్పాట్లు చేసింది. ఇక‌, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 30 శాతం ఉద్యోగులు, సిబ్బందితో పనిచేస్తాయి. మ్యాచ్ బాక్స్ పరిశ్రమలు 50 శాతం కార్మికులతో ప‌నిచేస్తాయి.. అపార్ట్ మెంట్ల కోసం ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు మరియు హౌస్ కీపింగ్ సేవలను ఇ-రిజిస్ట్రేషన్‌లో అనుమతిస్తారు. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కంప్యూటర్ మరియు మోటారు టెక్నీషియన్లు, వడ్రంగులు ఈ-రిజిస్ట్రేషన్‌లో ఉదయం 6 నుండి సాయంత్రం 5 గంటల మధ్య పని చేయ‌వ‌చ్చు.. ఎలక్ట్రికల్ వస్తువులు, బల్బులు, కేబుల్స్, స్విచ్‌లు మరియు వైర్లు విక్రయించే దుకాణాలను ఉదయం 6 నుండి సాయంత్రం 5 గంటల మధ్య అనుమతిస్తారు. సైకిల్ మరియు ద్విచక్ర వాహన వర్క్‌షాప్‌లు, హార్డ్‌వేర్ షాపులు, మోటారు విడిభాగాల అమ్మకందారులు, స్టేషనరీ దుకాణాలు, ట్రావెల్ ఆపరేటర్ల వాహన మరమ్మతు దుకాణాలు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ప‌నిచేసుకోవ‌చ్చిని ప్ర‌భుత్వం పేర్కొంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-