ఫలించిన లాక్ డౌన్.. మెరుగైన ఫలితాలు!

తెలంగాణలో అమలు చేస్తున్న కఠిన లాక్‌డౌన్‌ నిబంధనలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. సుమారు నెల రోజుల తర్వాత తెలంగాణలో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఆసుపత్రిలో అరగంటకే బెడ్లు దొరుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు కోవిడ్ కు వచ్చే కాల్స్ కూడా పూర్తి మొత్తంలో తగ్గాయి. రాష్ట్రంలో ఈ నెల 12 నుంచి అమల్లోకి వచ్చిన లాక్ డౌన్ కారణంగా ఉదయం 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు రోడ్లపై రాకపోకలతో పాటు అన్ని వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేశారు. అత్యవసరమైన వారిని మినహాయించి, అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. రోడ్లపై రద్దీ తగ్గిపోవడంతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడిందని నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 30న లాక్ డౌన్ ముగియనుండగా.. పొడిగిస్తారో లేదో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-