బ్రేకింగ్: హిందూపురంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం

అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం కలిగిస్తున్నాయి. హిందూపురం కొట్నూరు చెరువు మరువ వద్ద తృటిలో తప్పింది పెను ప్రమాదం.నీటిలో చిక్కుకుపోయింది తూముకుంట గార్మెంట్స్ కు వెళ్లే ప్రైవేటు బస్సు.

నీటి ప్రవాహం భారీగా ఉన్నా రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు డ్రైవర్. బస్సులో దాదాపు 30 మంది మహిళలు వున్నారు. స్థానికుల సహాయంతో బయటపడ్డారు కార్మికులు. భారీ నీటి ప్రవాహం వున్నప్పుడు బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా వుండాలని స్థానికులు సూచిస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడడంతో మహిళా కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు.

బ్రేకింగ్: హిందూపురంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం

Related Articles

Latest Articles