ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఏపీలో 11 స్థానాలు ఏకగ్రీవం..!

ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఎన్నికలు జరిగినా వార్‌ వన్‌ సైడే అంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేశారు.. ఇప్పటికే ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, వాటికి జరిగిన బై పోల్‌ ఇలా అన్నింటిలోనూ అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదే పై చేయి.. ఇక, ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ఆ పార్టీ హవాయే కొనసాగుతోందని చెప్పాలి.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ పరిశీలన ప్రక్రియ ఇవాళ పూర్తి అయ్యింది.. 11 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయినట్టే ఎందుకుంటే.. 11 స్థానాల్లో అధికార వైసీపీ అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు.. దీంతో ఆ 11 ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీ ఖాతాలో చేరిపోనున్నాయి.

Read Also: బరాత్‌లో బ్యాండ్‌ మోత.. గుండెపోటుతో కోళ్లు మృతి..! పోలీసులకు ఫిర్యాదు..

ఇక, ఎమ్మెల్సీ స్థానాలు, అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే.. కృష్ణా జిల్లా నుంచి తలసిల రఘురామ్, మొండితోక అరుణ్ కుమార్‌, విశాఖపట్నం జిల్లా నుంచి వరుదు కల్యాణి, వంశీ కృష్ణ యాదవ్, గుంటూరు జిల్లా నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మూరుగుడు హనుమంతరావు, విజయనగరం జిల్లా నుంచి ఇందుకురు రఘురాజు, తూర్పు గోదావరి జిల్లా నుంచి అనంత ఉదయ భాస్కర్, అనంతపురం జిల్లా నుంచి వై శివరమిరెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి భరత్, ప్రకాశం జిల్లా నుంచి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. దీనిపై ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.

Related Articles

Latest Articles