హైదరాబాద్ పోలీసులను బురిడీ కొట్టిస్తున్న లోన్ యాప్ నిర్వాహకులు…

హైదరాబాద్ పోలీసులను బురిడీ కొట్టిస్తున్నారు లోన్ యాప్ నిర్వాహకులు. ఇప్పటికే 300 కోట్లు రూపాయలను ఫ్రీజ్ చేసారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. అయితే బ్యాంకులలో ఫ్రీజ్ అయిన తమ ఖాతాలను తెరిపించుకునే యత్నం చేస్తున్నారు లోన్ యాప్ నిర్వాహకులు. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ అధికారుల పేరుతో బ్యాంకులకు ఆదేశాలు, నకిలీ లెటర్ హెడ్, స్టాంపులు వేసి ఐసిఐసిఐ బ్యాంకుకు చెందిన ఢిల్లీ గుర్గావ్ తదితర బ్రాంచులకు పంపించారు. కానీ అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అవి నకిలీ లేఖలని తేల్చిన సైబర్ క్రైమ్స్ అధికారులు ఐసిఐసిఐ బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-