దాదాపుగా ఖరారైన టీటీడీ పాలకమండలి సభ్యులు జాబితా

టీటీడీ పాలకమండలి సభ్యుల జాబితా దాదాపుగా ఖరారైంది. మొదటి విడతలో పాలకమండలి సభ్యుల జాబితాను విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. రెండవ విడతలో ప్రత్యేక ఆహ్వనితుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. పాలకమండలి సభ్యులుగా ఏపీ నుంచి పోకల అశోక్ కుమార్,మల్లాడి క్రిష్ణారావు,వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి,ఎమ్మేల్యేలు కాటసాని,గోర్లబాబురావు,మధుసూదన్ యాదవ్… తెలంగాణ నుంచి రామేశ్వరావు,లక్ష్మినారాయణ,పార్దసారధి రెడ్డి,మూరంశెట్టి రాములు,కల్వకుర్తి విద్యాసాగర్… తమిళనాడు నుంచి శ్రీనివాసన్,ఎమ్మేల్యే నందకుమార్,కన్నయ్య… కర్నాటక నుంచి శశిధర్,ఎమ్మల్యే విశ్వనాధ్ రెడ్డి… మహారాష్ట్ర నుంచి శివసేనా కార్యదర్శి మిలింద్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

అయితే తమిళనాడు కు చెందిన కన్నయ్య పై అభియోగాలు ఉన్నాయి. 2018 లోనే పిఎంఓ ఆదేశాలు మేరకు కన్నయ్య పై సిబిఐ విచారణ కోరింది రైల్వే విజిలేన్స్ శాఖ. 1500 కోట్ల అక్రమ ఆస్తులు కన్నయ్య కలిగి వున్నట్లు అభియోగాలు వచ్చాయి. కన్నయ్య చైర్మన్ గా వున్న రైల్వే సోసైటికి సంబంధించి మరో 108 కేసులు పెండింగ్ లో వున్నట్ల సమాచారం. అయితే కన్నయని పాలకమండలి సభ్యులుగా సిఫార్సు చేసింది తమిళనాడు సీఎంగా స్టాలిన్ తెలుస్తుంది. చుడాలిమరి ఎం జరుగుతుంది అనేది.

Related Articles

Latest Articles

-Advertisement-