మందుబాబులకు షాక్.. రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్‌ !

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో కూడా అన్ని ఏర్పాట్లు చేసింది తెలంగాణ సర్కార్‌. ముఖ్యంగా తెలంగాణ పోలీసులు ఎక్కువగా.. హైదరాబాద్‌పై ఫోకస్‌ చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లను చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే రేపు, ఎల్లుండి హైదరాబాద్‌ నగరం పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, అలాగే బార్‌ అండ్‌ రెస్టారెంట్లను మూసివేస్తున్నట్లు… ప్రకటించారు తెలంగాణ ఎక్సైజ్‌ అండ్‌ ఆబ్కారీ శాఖ అధికారులు. బోనాలు, ఫలహారబండ్ల ఊరేగింపు, మరియు రంగం కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని మద్యం దుకాణాలు మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది తెలంగాణ ఎక్సైజ్‌ అండ్‌ ఆబ్కారీ శాఖ. ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ తాజా నిర్ణయంతో.. రేపు, ఎల్లుండి వైన్ షాపులు మూతపడనున్నాయి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-