పీఎస్‌జీ తరపున తొలి గోల్‌ సాధించిన మెస్సీ..

మాంచెస్టర్‌ సిటీతో జరిగిన గ్రూప్‌ మ్యాచ్‌లో పీఎస్‌జీ స్టార్‌ ప్లేయర్‌ లియోనల్‌ మెస్సీ గోల్‌ సాధించడంతో పారిస్‌ నగరం దద్దరిల్లింది. రెండు ద‌శాబ్దాల పాటు బార్సిలోనా క్ల‌బ్‌కు ఆడిన మెస్సీ.. పీఎస్‌జీ తరఫున త‌న తొలి గోల్‌ సాధించి జట్టుకు 2-0తో విజయాన్ని అందించడంతో అభిమానులు పండగ చేసుకున్నారు. తమ ఆరాధ్య ఆటగాడు తొలిసారి తమ క్లబ్‌ తరఫున గోల్‌ చేయడంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. 74వ నిమిషంలో ఎంబ‌పే అందించిన అద్భుత‌మైన పాస్‌ను మెస్సీ గోల్‌గా మ‌లిచాడు. ఈ గోల్‌ను మెస్సీ.. మ‌రో స్టార్ ప్లేయ‌ర్ నెయ్‌మాన్‌తో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

-Advertisement-పీఎస్‌జీ తరపున తొలి గోల్‌ సాధించిన మెస్సీ..

Related Articles

Latest Articles