షాకింగ్ : కరోనాతో సింహం మృతి..

కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తూనే ఉంది. ఇప్పటికే చాలా మంది కరోనాకు బలి అయ్యారు. ఈ వైరస్ మనుషులనే కాదు.. మూగ జీవులను వదలడం లేదు. తాజాగా కరోనాతో ఓ సింహం మృతి చెందింది. ఈ ఘటన తమిళనాడులోని వండలూర్ అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్ లో చోటు చేసుకుంది. “నీలా” అనే తొమ్మిది సంవత్సరాల ఆడ సింహం కరోనాతో మృతి చెందింది. ఈ జూలాజికల్ పార్క్ లో మొత్తం 11 సింహాలు ఉండగా.. 9 సింహాలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. లాక్ డౌన్ కారణంగా గత నెల రోజులుగా జూలాజికల్ పార్క్ మూసి ఉన్నప్పటికీ వాటికి కరోనా సోకింది. అంతే కాదు జూ సిబ్బంది మొత్తం వ్యాక్సినేషన్ చేయించుకున్నావారే గాక, ఎవరికి కరోనా సోకక పోవడం గమనార్హం. మరి ఎలా సింహాలకు కరోనా సోకిందనే దానిపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-