ఆక‌లేస్తేనే వేట… దాహ‌మేస్తే అంతా సమానమే…

అడవికి రాజు సింహం.  అందులో ఎలాంటి సందేహం అవ‌స‌రం లేదు.  సింహానికి ఆక‌లేస్తేనే వేటాడుతుంది త‌ప్పించి పులి, ఇత‌ర కౄర‌మృగాల మాదిరిగా వేటాడి ఆహారాన్ని దాచుకోదు.  అందుకే సింహం ఆక‌లిగా ఉన్న‌ప్పుడు దానికి ఎదురుగా వెళ్లాలి అంటే భ‌య‌ప‌డే జంతువులు, క‌డుపు నిండిన త‌రువాత సింహం ప‌క్క‌కు వెళ్లి నిల‌బ‌డుతుంటాయి.  అంతెందుకు సింహంతో క‌లిసి ప‌క్క‌పక్క‌నే నిల‌బ‌డి నీళ్లు తాగుతుంటాయి. ఇలానే, ఓ సింహం, దానిపక్క‌నే జీబ్రా నిల‌బ‌డి నీళ్లు తాగుతున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.  ఇంకేముంది అలాంటి అరుదైన దృశ్యాల‌ను కెమెరాలో బందించారు జంతుప్రేమికులు.  వాటికి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ గా అవుతున్నాయి.  ఆక‌లేస్తేనే వేట అని, దాహ‌మేస్తే అంతా స‌మాన‌మే అని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.  

Read: ఒక వైపు పండుగ సీజ‌న్‌…మరోవైపు క‌రోనా…

Related Articles

Latest Articles

-Advertisement-