డేరింగ్ అండ్ డాషింగ్ టీమ్ తో అన్ స్టాపబుల్ .. సంక్రాంతికి రచ్చే..

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా వ్యహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం రానా దగ్గుబాటితో ఆటలు ఆడిన బాలయ్య.. నెక్స్ట్ సంక్రాంతి ఎపిసోడ్ కి మరింత వినోదం పంచడానికి రెడీ ఐపోయారు. సంక్రాంతి స్పెషల్ గా అన్ స్టాపబుల్ నెక్స్ట్ గెస్ట్ గా లైగర్ టీమ్ విచ్చేసింది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, హీరో విజయ్ దేవరకొండ, నటి కమ్ నిర్మాత ఛార్మితో బాలయ్య సందడి చేయనున్నారు.

ఇక ఈ ఎపిసోడ్ పోస్టర్ ని ఆహా రిలీజ్ చేసింది. జనవరి 14 న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపిన ఏంకర్స్ ప్రోమో త్వరలోనే రిలీజ్ కానున్నట్లు తెలిపారు. బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కాంబోలో ‘పైసా వసూల్’ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే లైగర్ షూటింగ్ లో బాలయ్య సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ ఒక స్పెషల్ రోల్ లో కనిపించనున్నట్లు వార్తలు గుప్పమంటున్నాయి. మరి ఆ విషయంపై ఈ షోలో ఏమైనా హింట్ ఇస్తారేమో చూడాలి. ఏది ఏమైనా ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ పంచెకట్టుతో స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపించారు. దీంతో ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

Latest Articles