Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Lifestyle Centre Has Sent Notices To Vivo Oppo Xiaomi And Oneplus

నాలుగు చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు కేంద్రం షాక్!

Updated On - 03:52 PM, Wed - 20 October 21
By GSN Raju
నాలుగు చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు కేంద్రం షాక్!

జాతీయ భద్రత, పౌరుల వ్యక్తిగత గోప్యత కోసం కేంద్ర ప్రభుత్వం చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలపై కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం నాలుగు చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు నోటీసులు జారీచేసింది. అందులో వివో, ఒప్పో, షావోమీ, వన్ ప్లస్ కంపెనీలు వున్నాయి. ఈ కంపెనీలు తయారుచేసే స్మార్ట్ ఫోన్లలో వాడే వివిధ సాంకేతిక అంశాలను తెలియచేయాలని కేంద్రం నోటీసులిచ్చింది. ఫోన్లలో వాడే హార్ట్ వేర్, సాఫ్ట్ వేర్ వివరాలు, ప్రీ ఇన్‌స్టాల్ యాప్స్‌, భద్రత, షేరింగ్ అంశాలు, వినియోగదారుల భద్రతకు సంబంధించిన షేరింగ్ అంశాలను కేంద్రం పరిశీలించనుంది.

చైనా కంపెనీలు భారతీయ వినియోగదారుల వ్యక్తిగత వివరాలు, కాంటాక్ట్ వివరాలు, ఆధార్ కార్డు, లొకేషన్ వంటివి షేర్ చేయాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ పౌరుల భద్రత కోసం కేంద్రం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆయా కంపెనీలకు నోటీసులు జారీచేసింది. వివో, ఒప్పో, షావోమీ, వన్ ప్లస్.. వంటి కంపెనీలు భారతీయ మార్కెట్లో 50 శాతం పైగా స్థానాన్ని ఆక్రమించాయి. మిగతా ఫోన్ల కంటే ఇవి కాస్త తక్కువ ధరకు లభిస్తున్నాయి.

దీంతో వినియోగదారులు వాటివైపు మొగ్గుచూపుతున్నారు. ఈమధ్య కాలంలో లోన్ యాప్‌లు ఎంత అరాచకానికి కారణం అయ్యాయో అందరికీ తెలిసిందే. లోన్ ఇవ్వడం, వారి వ్యక్తిగత వివరాలు, ఫ్రెండ్స్ వివరాలు కూడా సేకరించి… ఈఎంఐ ఆలస్యం అయితే వారిని వేధించడం అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కేంద్రం వినియోగదారుల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది.

గత ఏడాది లడఖ్ లో గాల్వాన్ ఘటన తరువాత, భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో దేశ భద్రత దృష్యా భారత ప్రభుత్వం పలు చైనా యాప్ లను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. 2020లో మోడీ ప్రభుత్వం మొత్తం 220 చైనా యాప్ లను బ్యాన్ చేసింది.

ఇండియా భద్రతా ప్రమాణాలకు ముప్పు కలిగించేవిగా ఉన్నాయని చెప్పి.. చైనాకు చెందిన 59 యాప్ లను 2020 జూన్ 29 న బ్యాన్ చేశారు. అందులో హలో, టిక్ టాక్, యూసీ బ్రౌజర్, కామ్ స్కానర్ వంటివి ఉన్నాయి. ఆ తరువాత సెప్టెంబర్ 5 వ తేదీన 118 యాప్ లను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. అందులో పబ్జీ, పబ్జీ లైట్ వంటివి ఉన్నాయి. ఆ తరువాత నవంబర్ 24న మరో 43 చైనా యాప్ లపై నిషేధం విధించింది. గత ఏడాది 220 చైనా యాప్స్‌ పై కేంద్రం ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. తాజాగా నాలుగు స్మార్ట్ ఫోన్ కంపెనీలకు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది.

  • Tags
  • china
  • Chinese Apps
  • OnePlus
  • Oppo
  • Security

RELATED ARTICLES

Abdul Rehman Makki: ఉగ్రవాదిని చైనా, పాకిస్థాన్ ఎందుకు కాపాడుతున్నాయి?

Moto G42: మోటొరోలా నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Technology: Realme R100 స్మార్ట్ వాచ్ స్పెషాలిటీ

Samsung Galaxy F13: సాంసంగ్ నుంచి బడ్జెట్ ఫోన్ వచ్చేస్తోంది..

China-India: మరోసారి చైనా దుర్బుద్ధి.. పాక్ ఉగ్రవాదికి యూఎన్ లో మద్దతు

తాజావార్తలు

  • Naga Chaitanya: మొన్న సమంత.. నేడు శోభితా.. చైతూకు తప్పేలా లేదే..?

  • Bandi Sanjay: మోడీని అంబేద్కర్‌ వారసుడితో పోల్చిన బండి

  • Sairam Shankar : ‘వెయ్ దరువెయ్’ అంటున్నసాయిరామ్ శంకర్

  • Thammineni Seetharam : జగన్ అన్నమాటను నిలబెట్టుకున్నారు

  • Rakul Preet Singh : ఊపేస్తున్న రకుల్ డ్యాన్స్ వీడియో!

ట్రెండింగ్‌

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

  • Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions