స్కూల్ క్యాంటిన్‌లో చిరుత…నాలుగు గంట‌ల‌పాటు…

ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో తెలియ‌దు…  ఓ చిరుత స్కూల్ క్యాంటిన్‌లోకి దూరింది.  విష‌యం తెలుసుకున్న క్యాంటిన్ సిబ్బంది వెంట‌నే అట‌వీశాఖ అధికారుల‌కు, వైల్డ్ లైఫ్ సంస్థ‌కు స‌మాచారం అందించారు.  హుటాహుటిన అట‌విశాఖాధికార‌లు, వైల్డ్ లైప్ సిబ్బంది దాదాపు నాలుగు గంట‌ల‌పాటు రెస్క్యూ చేసి చిరుత‌ను బందించి అడ‌విలో వ‌దిలేశారు.  

Read: “వాలిమై” యూరప్ ట్రిప్ ?

చిరుత‌కు గాయాలు కావ‌డంతో అది క్యాంటిన్‌లోకి వ‌చ్చి ఉండోచ్చ‌ని అధికారులు చెబుతున్నారు.  వైల్డ్‌లైఫ్ ఎస్ఒఎస్ సంస్థ చిరుత రెస్క్యూకి సంబందించిన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఈ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.  చిరుత‌ను ర‌క్షించిన తీరుకు నెటిజ‌న్ల నుంచి ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి.  ఈ సంఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్‌న‌గ‌ర్ జిల్లాలోని త‌వాలి ధోకేశ్వ‌ర్ గ్రామంలోని జ‌వ‌హార్ న‌వోద‌య విద్యాల‌యం క్యాంటిన్‌లో జ‌రిగింది. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-