ప్రారంభమైన శాసన మండలి సమావేశాలు

ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే మండలి సమావేశాలు ప్రారంభంలోనే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండలి ముందుకు 3 రాజధానుల చట్ట ఉపసంహరణ బిల్లు ప్రవేశపెట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు రద్దుపై మండలిలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బుగ్గన మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని భావించామన్నారు.

పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లోనే పెట్టారని అన్నారు. మిగితా రాష్ట్రాలు బీహెచ్‌ఈఎల్‌, బీడీఎల్‌ వంటి సెక్టార్లను రాజధానిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో పెట్టారని గుర్తు చేశారు. దీని వల్ల వెనుకబడ్డ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి సాధ్యమైందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ ఒక్కటే అభివృద్ధి అయ్యిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగకపోతే ఒక్క ప్రాంతం మాత్రమే అభివృద్ధి అవుతుందని ఆయన అన్నారు.

Related Articles

Latest Articles