పాలస్తీనా-ఇజ్రాయిల్ రగడ… రంగంలోకి లెబనాన్… యుద్ధం తప్పదా? 

పాలస్తీనా-ఇజ్రాయిల్ రగడ... రంగంలోకి లెబనాన్... యుద్ధం తప్పదా? 

పాల‌స్తీనా-ఇజ్రాయిల్ దేశాల మ‌ద్య గ‌త కొన్ని రోజులుగా ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కోన్నది.  జెరూస‌లేం డే రోజున పాల‌స్తీనాకు చెందిన హ‌మాస్ ఉగ్ర‌వాదులు రాకెట్ల‌తో విరుచుకు ప‌డ్డారు.  అయితే, జెరూస‌లేంలో ఏర్పాటు చేసిన ఐర‌న్ డోమ్ వ‌ల‌న పెద్ద‌గా ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు.  ఆ త‌రువాత, ఇజ్రాయిలో గాజాప‌ట్టిపై వైమానిక దాడి చేసింది.  ఈ దాడిలో 100 మందికి పైగా పౌరులు మ‌ర‌ణించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక‌త్త‌లు మ‌రింత ఉదృతం అయ్యాయి.  ఇక ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ రాజ‌ధాని టెల్ అవీవ్‌లో యూధుల‌కు, అర‌బ్బుల‌కు మ‌ద్య గొడ‌వ‌లు జ‌రుగుతుండ‌టంతో పెద్ద సంఖ్య‌లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు రంగంలోకి అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు.  ఇక ఇదిలా ఉంటే, పాల‌స్తీనాకు మ‌ద్ద‌తుగా హ‌మాస్ ఉగ్ర‌వాద సంస్థ 1750 కి పైగా రాకెట్ల‌ను ఇజ్రాయిల్‌పైకి ప్ర‌యోగించింది.  ఇక ఇదిలా ఉంటే, ఈ వ్య‌వ‌హారంలోకి లెబ‌నాన్ అడుగుపెట్ట‌డంతో మ‌రింత ఉద్రిక్త‌త‌లు చోటుచేసుకునే అవ‌కాశం ఉంది.  లెబ‌నాన్ నుంచి మూడు రాకెట్లు ద‌క్షిణ ఇజ్రాయిల్ వైపు దూసుకొచ్చిన‌ట్టు నిపుణులు చెప్తున్నారు.  అటు ట‌ర్కి కూడా పాల‌స్తీనాకు మ‌ద్ద‌తు ఇవ్వ‌టంతో యుద్దం త‌ప్ప‌ద‌నే సంకేతాలు వెళ్తున్నాయి.  పాల‌స్తీనాకు మ‌ద్ద‌తుగా ముస్లీం దేశాలు ఒక్క‌టి కావాల‌ని ట‌ర్కి అధ్య‌క్షుడు పిలుపునివ్వ‌డంతో ఆ ప్రాంతంలో వాతావ‌ర‌ణం మ‌రింత వేడెక్కింది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-