మహేష్ సరసన ఛాన్స్ పట్టేసిన అందాల రాక్షసి..?

‘అందాల రాక్షసి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. ఈ చిత్రం తరువాత అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అందం, అభినయం కలబోసిన ఈ ముద్దుగుమ్మకి కొన్ని సినిమాలు విజయాన్ని తెచ్చిపెట్టిన.. స్టార్ హీరోయిన్ గా మారే అవకాశం మాత్రం రాలేదనే చెప్పాలి. ఇటీవల గీతా ఆర్ట్స్ లో యంగ్ హీరో కార్తికేయ సరసన ‘చావు కబురు చల్లగా’ చిత్రంలో నటించింది కానీ లావణ్య మాత్రం నిరాశ తప్పలేదు. ఇక ఇటీవల గ్లామర్ డోస్ పెంచిన సొట్ట బుగ్గల సుందరి పంట పండినట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబో లో వస్తున్న చిత్రంలో లావణ్య ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం అందుతోంది. ‘సర్కారు వారి పాట’ అనంతరం మహేష్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా పూజా హెగ్డే ఎంపిక అవ్వగా సెకండ్ హీరోయిన్ గా లావణ్య ను తీసుకున్నట్లు సమాచారం. మొదట ఈ పాత్ర కోసం నభా నటేష్ పేరు వినిపించినా చివరికి లావణ్యనే కన్ఫర్మ్ చేశారంట మేకర్స్. ఇక దీంతో అమ్మడి పంట పండినట్లే.. త్రివిక్రమ్ దర్శకత్వలో మహేష్ సరసన అంటే మాటలు కాదు.. ఏదిఏమైనా ఈ వార్త నిజమైతే లావణ్య దశ తిరిగినట్లే..

Related Articles

Latest Articles