‘మా’ ఎన్నికల్లో ఉద్రిక్తత… లాఠీ ఛార్జ్

‘మా’ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. భారీ డైలాగులు, తీవ్ర స్థాయిలో విమర్శలు, పోట్లాటలు, కొరుక్కోవడాలు, అలగడాలు మధ్య క్షణక్షణం ఉత్కంఠను రేపుతున్నాయి ‘మా’ ఎన్నికలు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ‘మా’ సభ్యులు ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. మొత్తం 900 మంది సభ్యులు ఉండగా ఇప్పటికే 580 మంది ‘మా’ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Read also : మీడియాకి మంచి మెటీరియల్ దొరికింది కదా… చిరంజీవి సెటైర్

క్యారక్టర్ ఆర్టిస్టులు, స్టార్ హీరోలూ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో స్కూల్ కు క్యూ కట్టారు. ఇప్పటి వరకూ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, రాజ్ తరుణ్, నిఖిల్ వంటి హీరోలూ ఓటు వేశారు. కాగా తాజాగా అక్కినేని అఖిల్ ఎన్నికల కేంద్రం దగ్గరకు చేరుకోగా ఆయనను చూడడానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. అయితే పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అక్కడున్న వారిపై లాఠీ ఛార్జ్ చేశారు. కాగా 4 గంటల నుంచి ఎన్నికల కౌంటింగ్ మొదలు కానుంది.

-Advertisement-'మా' ఎన్నికల్లో ఉద్రిక్తత… లాఠీ ఛార్జ్

Related Articles

Latest Articles