“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5″పై ఆసక్తికర అప్డేట్

బిగ్ బాస్ తెలుగు సీజన్-5 గత నెలలోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకు భారీ ప్రేక్షకాదరణ ఉన్న విషయం తెలిసిందే. తెలుగులో ఇప్పటికే 4 బిగ్ బాస్ సీజన్లు ముగిశాయి. అందులో బిగ్ బాస్ తెలుగు సీజన్-1కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, బిగ్ బాస్ తెలుగు సీజన్-2కు నేచురల్ స్టార్ నాని హోస్టులుగా వ్యవహరించారు. బిగ్ బాస్ తెలుగు సీజన్-3,4 లకు మాత్రం కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. గడిచిన సీజన్లలో కంటెస్టెంట్లే కాదు హోస్టుల రెమ్యునరేషన్ కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్-5 ప్రారంభం గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తెలుగు బిగ్ బాస్ నిర్వాహకులు ఈ జూన్ లో 5వ సీజన్ ను ప్రారంభించాలని అనుకున్నారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వారి ప్లాన్స్ కు బ్రేక్ పడింది. తాజా అప్డేట్ ప్రకారం బిగ్ బాస్ ఐదవ సీజన్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారట నిర్వాహకులు. జూమ్ ద్వారా అభ్యర్థుల ఆడిషన్లు జరుగుతున్నాయని, ప్రస్తుతం పోటీదారుల జాబితాను సిద్ధం చేస్తున్నారని సమాచారం. జూలై నెలలో ఈ రియాలిటీ షో ప్రేక్షకుల ముందుకు రానుందట. ఈ మేరకు నిర్వాహకుల నుంచి త్వరలోనే ప్రకటన రానుంది అంటున్నారు. కింగ్ నాగార్జున ఈ సీజన్ కు కూడా హోస్ట్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-