ఇంకా ఐసీయూలోనే లతా మంగేష్కర్… తాజా హెల్త్ అప్డేట్

కోవిడ్-19తో పాజిటివ్ నిర్ధారణ కావడంతోనే ఆసుపత్రిలో చేరిన లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇప్పటికీ ఐసీయూలోనే ఉన్నారు. తాజాగా ఆమె హెల్త్ పై అప్డేట్ వచ్చింది. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో ఆమెకు చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రతీత్ సంధాని కొత్త ఆరోగ్య అప్‌డేట్‌ను షేర్ చేశారు. లతా మంగేష్కర్ కు పాజిటివ్ వచ్చిందని, దానికితోడు న్యుమోనియా కూడా ఉండడంతో ఆమె ఆమె ఇంకా ఐసీయూలో చికిత్స పొందుతున్నారని డాక్టర్ వెల్లడించారు. అంతేకాదు ఈ 92 ఏళ్ల గాయని 10 నుండి 12 రోజుల పాటు ఆసుపత్రిలో పరిశీలనలో ఉంటారని ఆయన తెలిపారు.

Read Also : ‘రౌడీ బాయ్స్’కు ‘రాధేశ్యామ్’ హెల్ప్

లతా మేనకోడలు మాట్లాడుతూ ఆమె బాగానే ఉందని, ఆమె వయస్సును దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త కారణాల కోసం మాత్రమే ఐసీయూలో ఉంచామని, దయచేసి తమ గోప్యతను గౌరవించండి అంటూ రిక్వెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులతో పాటు బాలీవుడ్ మొత్తం లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Related Articles

Latest Articles