మరోసారి పెరిగిన పెట్రోల్‌ ధరలు

ఆకాశమే హద్దుగా ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 మార్క్‌ను దాటగా.. డీజిల్‌ సైతం రూ.100 వైపు పరుగులు పెడుతున్నది. తాజాగా పెట్రోల్‌పై లీటర్‌కు 28 పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెంచాయి. పెంచిన ధరలతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.90 కాగా, డీజిల్ ధర రూ.94.82 చేరింది. ఈ జూన్‌ నెలలో ఇప్పటివరకు ఆరు సార్లు ఇంధన ధరలుపెరగ్గా.. మే 4వ తేదీ నుంచి నేటి వరకు 23 సార్లు చమురు ధరలు పెరిగాయి. మే 4 నుంచి ఇప్పటి వరకు లీటర్ పెట్రోల్‌ ధర రూ.5.81, డీజిల్‌ ధర రూ.6.12 పెరిగింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-