కడప జిల్లా వార్తలు.. రౌండప్

వివేకానంద హత్య కేసు: మూడో రోజు సీబీఐ విచారణ

నేడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో మూడో రోజు సీబీఐ విచారణ జరుగనుంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహాంలో సీబీఐ అధికారుల బృందం విచారణ చేయనుంది. నిన్న వైఎస్ వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాను ఏడు గంటల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. నేడు మరికొంతమంది కీలక వ్యక్తులను విచారించే అవకాశం కనిపిస్తోంది.

నేడు నగరంలో ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా

నేడు కడప జిల్లాలో ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా పర్యటించనున్నారు. నవరత్నాలు, పేదల ఇళ్ల నిర్మాణానికి భూమిపూజలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం అంజద్ బాషా పాల్గొననున్నారు.

నాలుగు ఇళ్లల్లో చోరీ

చాపాడు మండలం అల్లాడుపల్లి గ్రామంలో నాలుగు ఇళ్లల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తలుపు పగలగొట్టి సుమారు 8 తులాల బంగారు, 2.50 లక్షలు దొంగతనం చేశారు. సంఘటన స్థలానికి చేరుకొన్న చాపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బైకు, టిప్పర్ ఢీ.. ఒకరు మృతి

నందలూరు మండలం మంటపంపల్లె మౌలా దర్గా సమీపంలో బైకు, టిప్పర్ ఢీకోన్నాయి. ఘటనలో ద్విచక్ర వాహనదారుడు గాలిశెట్టి యల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వేకోడూరు నుండి అట్లూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన నందలూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-