సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్డేట్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నాల్రోజుల క్రితం యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ మీద తేజ్ నడిపిస్తున్న బైక్ స్కిడ్ అయ్యింది. అనంతరం ఆయనను ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఐసీయూలో తేజ్ కు చికిత్స జరుగుతోంది. ఆయన అభిమానులు, పలువురు సెలెబ్రిటీలు తేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు తరచుగా సాయి ధరమ్ తేజ్ కు సంబంధించిన హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సాయి ధరమ్ తేజ్ కు ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది.

Read Also : బిగ్ బాస్ 5 : ఈ వారం టార్గెట్ ఉమా ?

నిన్న సాయంత్రమే తేజ్ కు వెంటి లెటర్ ను వైద్యులు తొలగించారు. క్రమంగా తేజ్ ఆరోగ్యం మెరుగు పడుతోందని తెలుస్తోంది. తేజ్ కూడా చికిత్సకు బాగా స్పందిస్తున్నాడని వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు అప్పుడప్పుడు తేజ్ స్పృహలోకి వస్తున్నాడట. ప్రస్తుతం తేజ్ దగ్గరకు వైద్యులు ఎవ్వరినీ అనుమతించడం లేదు. డాక్టర్ అలోక్ రంజన్ నేతృత్వం లోని వైద్య బృందం సాయి ధరమ్ తేజ్ నీ క్లోజ్ గా మానిటరింగ్ చేస్తున్నారట. ఆయన త్వరగా కోలుకోవాలని టాలీవుడ్ ఆశిస్తోంది.

Related Articles

Latest Articles

-Advertisement-