కైకాల సత్యనారాయణ లేటెస్ట్ హెల్త్ అప్డేట్

లెజెండరీ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురై గత రెండు రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయనకు ట్రాకియోస్టోమీ శస్త్ర చికిత్స జరుగుతోంది. ఆసుపత్రిలో జాయిన్ అయినప్పటి నుంచి కైకాలకు ఐసీయూలో వెంటిలేటర్ సపోర్టుతో వైద్యం జరుగుతోంది. కైకాల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై అపోలో హాస్పిటల్స్ అధికారులు తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. బులెటిన్‌లో కైకాల స్పృహతో ఉన్నారని, అయితే ఇప్పటికీ తక్కువ రక్తపోటు ఉందని, వాసోప్రెసర్ సపోర్ట్ పై ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆ హెల్త్ బులెటిన్ లో ఈ రోజు కైకాల జిఐ ట్రాక్ట్ నుండి రక్తస్రావం లేదని, కైకాల సత్యనారాయణ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. దీంతో ఆయన ఆరోగ్యం గురించి సినిమా వర్గాలు కలత చెందుతున్నాయి. నిన్న చిరంజీవి కైకాల ఆరోగ్యం విషయం గురించి డాక్టర్ ను ఆరా తీశానని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను అని ట్వీట్ చేశారు.

Read Also : విరాటపర్వం ఓటీటీ డీల్‌ క్యాన్సిల్‌..ఎందుకంటే..?

Image

Related Articles

Latest Articles