ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖాళీ అవుతున్న బెడ్లు… అదుపులోకి వచ్చిన వైరస్

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కరోనా కేసులు తగ్గడంతో రెగ్యులర్ సేవలు ప్రారంభిస్తున్నాయి. కరోనా నెగిటివ్ వచ్చిన వారంతా త్వరగా కోలుకుంటుండటం, అత్యధికులకు ఐసీయూ బెడ్స్ అవసరం రాకపోవడంతో కరోనా అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇక కోవిడ్-19 ఆసుపత్రుల్లో చాలా పడకలు ఖాళీగానే ఉన్నాయి, ఆసుపత్రుల్లో రద్దీ కూడా ఎక్కువగా కనిపించడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ తర్వాత కేసులు ఎంత వేగంతో పెరుగుతాయన్న విషయమై ఓ అంచనాకు రావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-