తనయుడితో పవన్… పిక్ వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ల తనయుడు అకిరా నందన్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో పవన్, అకిరా కలిసి ఉన్నారు. అయితే ఈ పిక్ లో అకీరా హైట్ చూసి అంతా షాకవుతున్నారు. అప్పుడే అకిరా 6 అడుగుల 4 అంగుళాల పొడవు ఉన్నాడు. ఇక అకీరా వెండితెర ఎంట్రీకి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే రేణూ దేశాయ్ అఖీరా సినిమాల్లో నటిస్తానంటే తనకేం అభ్యంతరం లేదని ఇప్పటికే చెప్పేసింది. మరోవైపు ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. ఆ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, బండ్ల గణేష్ నిర్మాణంలో ఓ మూవీని పవన్ చేయాల్సి ఉంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-